ప్రభుకు కరోనా.. వివరణ ఇచ్చిన నటుడు

3 Oct, 2020 15:40 IST|Sakshi

చెన్నై : ప్రముఖ తమిళ నటుడు ప్రభు ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడినట్లు అనేక వార్తలు వెలవడ్డాయి. కరోనా సోకిన ప్రభు క్వారంటైన్‌లో ఉన్నారని, అందుకే ఆక్టోబర్‌ 1న జరిగిన జరిగిన తన తండ్రి శివాజీ గణేషన్‌ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమానికి రాలేదని నెట్టింట్లో వార్తలు వ్యాప్తించాయి. తాజాగా తానకు కరోనా సోకిందంటూ వస్తున్న వదంతులపై సీనియర్‌ నటుడు ప్రభు స్పందించారు. (అభిమాని కల నెలవేర్చిన అల్లు అర్జున్‌!)

తాను కరోనా బారినపడినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, సోషల్ మీడియాలో వస్తున్నవి పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇటీవల తన కాలు బెణికిందని, అందుక‌నే తండ్రి స్మార‌క కార్యకమానికి హాజరు కాలేక‌పోయాననని కార్లిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపిన ప్రభు త‌ప్పుడు వార్తలను న‌మ్మోద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. కాగా త‌మిళం, తెలుగుతో పాటు ప‌లు భాష‌ల‌లో న‌టించిన ప్రభు ప్రస్తుతం పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. (విన‌క‌పోతే క‌థ వేరే ఉంట‌ది: నాగ్ ఫైర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు