Prakash Nag On Godse Movie: బిజినెస్‌, యాక్టింగ్ రెండూ కొనసాగిస్తా: ‘గాడ్సే’ఫేం ప్రకాశ్‌ నాగ్‌

23 Jun, 2022 15:25 IST|Sakshi

మన ఇండియన్ సినిమా స్థాయి పెరిగింది. మన చిత్రాలను ఇప్పుడు  హలీవుడ్  వారు సైతం కాపీ  కొడుతున్నారు. మన సినిమాలో  ఫైట్స్ , ఇంటెన్సిటీ, లుక్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే బాక్సాఫీస్‌ వద్ద ఇండియన్‌ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్నాయి’అని అన్నారు నటుడు ప్రకాశ్‌ నాగ్‌. గోపి గణేశ్‌ పట్టాభి దర్శకత్వంలో సత్యదేశ్‌ హీరోగా నటించిన ‘గాడ్సే’ చిత్రంలో విలన్‌ పాత్రలో నటించాడు ప్రకాశ్‌ నాగ్‌. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. విలన్‌గా ప్రకాశ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

► మాది వైజాగ్ నేను అక్కడే పుట్టాను. మా ఫాదర్ ఆర్మీ లో ఉన్నందున నేను చాలా రాష్ట్రాలు తిరగవలసి వచ్చేది. అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తరువాత ఫైవ్ స్టార్ హోటల్ లో జనరల్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ హోటల్స్ లో వర్క్ చేయడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం నేను దుబాయ్ కి వెళ్లడం జరిగింది అక్కడ కొంతకాలం మల్టీ నేషనల్  కంపెనీలో వర్క్ చేశాను. అయితే  నా లైఫ్ స్టైల్ చాలా ట్రెండీగా ఉండేది. ఇక్కడ మ్యూచివల్ ఫ్రెండ్  ద్వారా దర్శకుడు గోపి పరిచయమయ్యారు.

► గోపికి నా వర్కింగ్ స్టైల్ నచ్చి మేము సోషల్ మెసేజ్ ఉన్న ఒక సినిమా తీస్తున్నాము ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ఉంది,మిమ్మల్ని చూడగానే మా సినిమాలో నేను అనుకున్న క్యారెక్టర్ కు మీరు సూట్ అవుతారు మీకు సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు.నేను తెలుగు వాడిని అయినందున నాకు చిన్నప్పటి నుండి నాకు తెలుగు సినిమా అంటే  చాలా ఇష్టం.అందుకే  నాకు మొదటి చిత్రానికే ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర దర్శక, నిర్మాతలు దొరకడం నా అదృష్టం. అందుకే వారికి నా ధన్యవాదములు 

► ఈ సినిమాలో సమాజంలో జరిగే చాలా విష‌యాల‌ను చ‌ర్చించాం. ముఖ్యంగా మ‌న వ్య‌వ‌స్థ‌లో భాగ‌మైన ప్ర‌భుత్వం.. ఎలా ప‌ని చేస్తుంది. అందులో లోపాలేంటి? అనే విష‌యాల‌ను చూపించాం. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. నేను గాడ్సే వంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది .

► ప్రస్తుతం నేఏను  కొన్ని కంపెనీ ల కు అడ్వైసరి రోల్ లో  ఉన్నాను. ఆ కంపెనీ ల బిజినెస్ గ్రోత్ కోసం వారు నా సలహాలు తీసుకుంటారు.అటు బిజినెస్ ఇటు యాక్టింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నా జర్నీని ఇక కొనసాగిస్తాను .

► నాకు తెలుగులో గాని బాలీవుడ్ లో గాని హాలీవుడ్ లో ఎక్కడైనా మంచి క్యారెక్టర్ దొరికితే నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను .ఇప్పుడిప్పుడే కొన్ని కథలు వింటున్నాను అవి ఏంటనేది త్వరలో తెలియజేస్తాను.

మరిన్ని వార్తలు