Prakash Raj: మీకంటే ఆమెనే ఎక్కువ.. అక్షయ్‌ కుమార్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

26 Nov, 2022 11:44 IST|Sakshi

బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు, నిఖిల్ సిద్ధార్థ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆమె ‍ట్వీట్‌ను తప్పబట్టారు.  ఓ నెటిజన్‌ ట్వీట్‌కు ఇండియన్ ఆర్మీని ఉద్దేశిస్తూ ఆమె రిప్లై ఇవ్వడమే వివాదానికి ప్రధాన కారణం. 2020లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో మన సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. 

(చదవంండి: బాలీవుడ్ నటిపై హీరో నిఖిల్‌ ఆగ్రహం.. ఎందుకంటే?)

అయితే తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్‌ ఆమెకు మద్దతుగా నిలిచాడు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ ఆమెను తప్పుపట్టడాన్ని ప్రకాశ్ రాజ్‌ ఖండించారు. ట‍్వీట్‌లో ఆయన రాస్తూ.. 'మీ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదు. మీకంటే ఎక్కువగా ఆమెనే మా దేశానికి సంబంధించినది. ఊరికేనే అడుగుతున్నా' అంటూ ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తలు