అభిమానులు.. ఈ పదం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వినిపిస్తూనే ఉంటుంది. పాలిటిక్స్ లేదా సినిమాలు కావొచ్చు. యువత పిచ్చిపిచ్చిగా అభిమానిస్తుంటారు. ఇలా చెప్పుకుంటే టాలీవుడ్‌లో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ అభిమాని చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!)
యువ హీరో రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్లాస్, మాస్ సినిమాలు చేస్తూ తనదైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు హీరోగా నటించిన కొత్త సినిమా 'స్కంద'. ఈ పాటికే అంటే సెప్టెంబరు 15న రిలీజ్ అయిపోవాల్సింది కానీ 'సలార్' వాయిదాతో డేట్ మార్చుకుంది. సెప్టెంబరు 28న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పుడు ఈ మూవీ పేరుని ఓ పిల్లాడికి పెట్టేశారు.
ఫ్యాన్స్ అసిసోయేషన్‌కి చెందిన సందీప్.. రామ్ కి అభిమాని అయిన హరిహర కొడుకు నామకరణ మహోత్సవానికి వెళ్లాడు. అయితే అతడి కొడుక్కి 'స్కంద' అని పేరు పెట్టారని ట్వీట్ చేశాడు. 'స్కంద' అనేది రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా టైటిల్. ఇప్పుడు ట్వీట్ రామ్ వరకు చేరింది. దీంతో అతడు స్పందించాడు. 'ఈ విషయం నా మనసుకు హత్తుకుంది. ఆ పిల్లాడికి స్కంద దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ అభిమానికి, అతడి కుటుంబాన‍్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను' అని రామ్.. రీట్వీట్ చేశాడు.
(ఇదీ చదవండి: ఓటీటీ హీరోయిన్‌గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ)
I’m so touched..I’m sure the blessings of lord Skanda will always be with him.. God bless you & your family.. ❤️ https://t.co/66uYUZtwVc
— RAm POthineni (@ramsayz) September 16, 2023