సాయికుమార్‌ ష‌ష్టిపూర్తి.. హాజరైన చిరు, నాగార్జున

25 Jul, 2021 17:42 IST|Sakshi

వైరల్‌ అవుతున్న సాయికుమార్ ష‌ష్టిపూర్తి ఫోటోలు

Sai Kumar Shashti Poorthi :  ప్రముఖ నటుడు సాయికుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పోలీస్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న సాయికుమార్‌ ఆ తర్వాత పలు సపోర్టింగ్‌ క్యారెక్టర్లతో మెప్పించారు. నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్‌ భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌, జీవిత రాజశేఖర్‌లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

చాలా గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సాయికుమార్‌ దంపతులకు అభినందనలు తెలియజేశారు. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయికుమార్‌ హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే పోలీస్ స్టోరీలో ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం బుల్లితెరపై వ్యాఖ్యాతగా సత్తా చాటుతున్న సాయికుమార్‌ సినిమాల్లోనూ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు