బుల్లితెర నటుడికి చేదు అనుభవం..

28 Sep, 2020 17:46 IST|Sakshi

వీడియో షేర్‌ చేసిన నటుడు.. జాగ్రత్త అంటూ సూచన

బుల్లితెర‌ నటుడికి చేదు అనుభవం ఎదురయ్యింది. కొందరు గుండాలు రోడ్డు మీద తనను బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపాడు. హప్పు కి ఉల్తాన్‌ పల్తాన్‌ ఫేమ్‌ సంజయ్‌ చౌదరికి ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశాడు. ‘గైస్‌ దయచేసి తెలుసుకొండి. నా విషయంలో ఇదే జరిగింది. నేరస్థులు మీరు ఎవరనే విషయం గురించి పట్టించుకోరు’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

సంజయ్‌ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను మధ్యాహ్నం సమయంలో మీరా రోడ్డు నుంచి షూటింగ్‌ జరిగే నైగావ్‌ ప్రాంతానికి వెళ్తున్నాను. ఇంతలో ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి నా కారు విండోని తట్టి పార్క్‌ చేయమని చెప్పాడు. అంతేకాక మరాఠీలో తిట్టడం ప్రారంభించాడు. నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తున్నాను. ఏ వాహనాన్ని ఢీ కొట్టలేదు. అతను గ్లాస్‌ను కిందకి దించమన్నాడు. నేను అలానే చేశాను. వెంటనే అతడు నా కారు డోర్‌ తెరిచి లోపలకి వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత నేను తన స్కూటీని ఢీ కొట్టానని.. అందువల్ల అతడికి 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు’ అన్నాడు. (చదవండి: క‌ర‌ణ్ పార్టీకి డ్ర‌గ్స్ కేసుకు సంబంధం లేదు)

This is actually happened with me criminals doesn’t care who you are

A post shared by Sanjay choudhary (@sanjayychoudhary) on

‘ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడు వచ్చారు. వారు ముగ్గురు నన్ను బెదిరించడం ప్రారంభించారు. నా దగ్గర అంత మొత్తం లేదని చెప్పాను. ఏటీఎంకి వెళ్లి డ్రా చేసి తీసుకురమ్మన్నారు. లేదంటే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. నా ఫోన్‌ లాక్కున్నారు. డబ్బులిస్తేనే మొబైల్‌ ఇస్తామన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదని వాలెట్‌ తెరిచి చూపించాను. దానిలో ఒక ఐదు వందల రూపాయల నోటు, 200 వందల రూపాయలు మొత్తం ఏడు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. వారు ఆ మొత్తం తీసుకుని వెళ్లి పోయారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. వారు గుండాలు అని తర్వాత అర్థం అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులందరికి నేను చెప్పేది ఒక్కటే.. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి’ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా