పుష్ప నటుడితో సత్యదేవ్‌ మల్టీస్టారర్‌!

19 Sep, 2022 21:16 IST|Sakshi

వైవిధ్యమైన కథలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్‌ కొత్త సినిమాను ప్రకటించారు.‘పెంగ్విన్‌’ సినిమా ఫేమ్‌ ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా ఓ సినిమా రూపొందనుంది.  బాలసుందరం, దినేష్‌ సుందరం నిర్మించనున్న ఈ చిత్రం సత్యదేవ్‌ కెరీర్‌లో 26వ మూవీ. ‘‘మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ ఇది. మరో హీరో పేరు త్వరలో వెల్లడిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

అయితే ఈ చిత్రంలో సత్యదేవ్‌తో పాటు పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ధనంజయ నటించనున్నట్లు తెలుస్తుంది. క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ సినిమాకు కెమెరా: మణికంఠన్‌ కృష్ణమాచారి, సంగీతం: చరణ్‌ రాజ్‌. కాగా సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. 

మరిన్ని వార్తలు