Satya Dev: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్‌ చేశా: సత్యదేవ్‌

18 Oct, 2022 15:35 IST|Sakshi

విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్‌. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్‌ తనదైన నటన స్కిల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన సత్యదేవ్ ఇటీవల గాడ్‌ఫాదర్‌ మంచి హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన జయదేవ్‌ పాత్రకి మంచి స్పందన వచ్చింది. గాడ్‌ఫాదర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ఆయన రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్‌-ఐశ్వర్యలు!

ఇదిలా ఉంటే సత్యదేవ్‌ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదులుకుని మరి ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్‌ ప్రారంభంలో ఆయన జాబ్‌ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటించాడు. ఇక సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ను పూర్తిగా వదిలేసి సినిమాల వైపే మొగ్గు చూపాడు. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించాడు. ‘అందరు నేను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలేసి సినిమాల్లోకి వచ్చానంటున్నారు. అది నిజం కాదు. సినిమాల్లోకి రావడం కోసమే నేను ఉద్యోగం చేశాను.  ఎందుకంటే అవకాశాలు వచ్చి నిలదొక్కునేంత వరకు డబ్బులు కావాలి కదా. డబ్బు కోసమే నేను జాబ్‌ చేశా. బ్లఫ్‌ మాస్టర్‌ సినిమా వరకూ జాబ్‌ చేస్తూనే షూటింగ్‌లో పాల్గోన్నాను’ అని చెప్పుకొచ్చాడు.

చదవండి: మోహన్‌ లాల్‌కు షాక్‌, అక్కడ ‘మాన్‌స్టర్‌’పై నిషేధం

అనంతరం ‘షూటింగ్‌ కోసం నైట్‌ షిఫ్ట్‌లు చేశాను. ఉదయం షూటింగ్‌, నైట్‌ ఉద్యోగం చేస్తూ వచ్చాను. జ్యోతిలక్ష్మి సినిమాకి గ్యాప్‌ లేకుండా 39 రోజులు పని చేశాను. ఈ మూవీ చేసేటప్పుడు నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆఫీసులో తెలియదు. జాబ్‌ చేస్తున్నాననే విషయం డైరెక్టర్‌ పూరీ గారికి తెలియదు.  జాబ్‌ టెన్షన్‌ షూటింగ్‌లో, సినిమా టెన్షన్‌ ఆఫీసుల కనిపించకుండ మేనేజ్‌ చేశా. ‘ఘాజీ’, ‘మనవూరి రామాయణం’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’ చిత్రాలు అలాగే పూర్తి చేశాను’ అని చెప్పాడు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో చేయాలనేది తన కల అని, ఆయనతో కలిసి నటించాలనే తన డ్రీమ్‌ను చాలా ఏళ్లుగా భద్రపరుచుకుంటూ వచ్చానన్నాడు సత్యదేవ్‌. 

మరిన్ని వార్తలు