సూర్యకు డబ్బింగ్‌ చెప్పిన నటుడు సత్యదేవ్‌

2 Oct, 2020 16:04 IST|Sakshi

హీరో సూర్య కథానాయకుడిగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర‌రై పోట్రు’ ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుద‌ల‌ కానుంది. అప‌ర్ణ బాల ముర‌ళి హీరోయిన్‌గా న‌టించనున్న ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు హీరో సూర్య ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. మొదట ఈ మూవీని ఈ ఏడాది వేసవిలో విడుద‌ల చేయాల‌నుకున్నప్పటికీ  కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా పడింది. దీంతో చివ‌ర‌కు ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 30న అమెజాన్‌లో విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యారు. (మోహన్‌బాబు నా గాడ్‌ ఫాదర్‌: సూర్య)

ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ'సినిమాలో క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు కీల‌క పాత్ర‌లో కన్పించనున్నారు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌ ‘ఆకాశం నీ హ‌ద్దురా’లో హీరో సూర్యకు విభిన్న పాత్రలతో నటుడుగా ప్రేక్షకాభిమానుల నుంచి మన్ననలు సత్యదేవ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఈ విషయాన్ని నిర్మాత బీఏ రాజు తన ట్విటర్‌లో వెల్లడించారు. సూర్యకు సత్యదేవ్‌ వాయిస్‌ అయితే సరిగా సెట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సత్యదేవ్‌ ఇటీవల విడుదలైన విలక్షణ చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం’తో ప్రేక్షకులను అలరించారు.

మరిన్ని వార్తలు