ఐనాక్స్‌ను ప్రారంభించిన ప్రముఖ నటుడు అడవి శేషు 

16 May, 2022 10:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ అగ్రగామి మల్టీప్లెక్స్‌ ఛెయిన్‌ ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ నగరంలో తమ నాలుగో మల్టీప్లెక్స్‌ సినిమా థియేటర్స్‌ను ఏర్పాటు చేసింది. కవాడిగూడ మెయిన్‌ రోడ్‌లోని సత్వా నెక్లెస్‌ మాల్‌లో ఏర్పాటైన  మల్టీప్లెక్స్‌ను ప్రముఖ నటుడు అడవి శేషు, దర్శకుడు శశికిరణ్‌ శనివారం ప్రారంభించారు. ఈ మల్టీ ప్లెక్స్‌లో మొత్తం 7స్క్రీన్స్‌ 1534 సీట్స్‌ ఉంటాయని ఐనాక్స్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అట్మాస్‌ సరౌండ్‌ సౌండ్, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ ప్రొజెక్షన్, 3డీ వ్యూ వంటి కిడ్స్‌ ప్లే ఏరియా తదితర ప్రత్యేకతలను ప్రేక్షకులు ఆస్వాదిస్తారన్నారు. ఈ మల్టీప్లెక్స్‌తో కలిపి నగరంలో తాము 26 స్క్రీన్స్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.  

చదవండి: (వాకింగ్‌కు వెళ్లిన.. సినీ నిర్మాత దుర్మరణం) 

మరిన్ని వార్తలు