కరోనాతో నటుడు మృతి

18 Jun, 2021 08:55 IST|Sakshi

కరోనా బారిన పడిన నటుడు శామన్‌మిత్రు (43)బుధవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది బంగారు పతకాన్ని పొందిన శామన్‌మిత్రు మొదట్లో ఛాయా గ్రాహకుడిగా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలకు పనిచేశారు. తర్వాత దర్శకుడిగా మారి తొరట్టి అనే చిత్రాన్ని నిర్మించి కథానాయకుడిగా నటించారు.

ఆ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకుంది. ఆయన నెల క్రితం కరోనా బారిన పడి క్రోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చేరారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కన్నుమూశారు. శామన్‌ మిత్రుకు భార్య శకుంతల, కుమార్తె మోక్ష ఉన్నారు. శామన్‌ మిత్రు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: రూ.26 కోట్ల మోసం! సంగీత ద‌ర్శ‌కుడిపై కేసు కొట్టివేత‌

తన తొలి సంపాదన ఎంతో బయట పెట్టిన విద్యాబాలన్‌..

మరిన్ని వార్తలు