అయ్యో! శివాజీ రాజాకు ఏమైంది, ఇలా అయిపోయారు..

4 Jul, 2021 22:00 IST|Sakshi

శివాజీ రాజా.. సినీ ప్రేక్షకులకు పెద్దగ పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, కారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఇలా ఎన్నో వందల సినిమాల్లో నటించిన శివాజీ రాజా తాజా లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాస్తా బోద్దుగా ఉండే ఆయన బాగా చిక్కిపోయి దర్శనం ఇచ్చారు. ఇలా ఆయనను చూసి అందరూ షాక్‌ అవతున్నారు. దీంతో ఆయన లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు మీడియాకు దూరంగా ఉన్న ఆయన ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చినప్పటికి తన ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.

అలా మీడియాకు ఇంతకాలం దూరంగా ఉన్న శివాజీ రాజా తన తనయుడు వినయ్‌ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘వేయు శుభములు కలుగు నీకు’ సినిమాలోని ఓ సాంగ్‌ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన బరువు తగ్గి చిక్కిపోయి కనిపించడంతో అందరి దృష్టి ఆయనపై పడింది.  ఏంటి ఆయన ఇలా అయిపోయారు, శివాజీ రాజాకు ఎమైందంటూ ఫాలోవర్స్‌, అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చాక బరువు తగ్గిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఆయన పూర్తిగా తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారని ఈ క్రమంలో ఎక్కువగా బయటకు రావడం కానీ మీడియాతో మాట్లాడటం కానీ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. కాగా శివాజీ రాజా 35 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నటుడిగా రాణించారు. తన కామెడియన్‌గా, విలన్‌గా, హీరోగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు.  అలా 400పైగా చిత్రాల్లో నటించిన ఆయన కొంతకాలం మా ఆధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య రిత్యా నటనకు బ్రేక్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు