డ్రగ్స్‌ ఎలా తీసుకోవాలో ఆ నటుడు నేర్పించారు

5 Mar, 2021 15:06 IST|Sakshi

తెలుగింటి అమ్మాయిలా కనిపించే కేరళ కుట్టి పూర్ణ.. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం నెగిటివ్‌ రోల్‌ చేయడానికి సైతం రెడీ అయిపోయింది. విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన సినిమా పవర్ ప్లే.  కోట శ్రీనివాస రావ్‌, ప్రిన్స్‌, అజయ్‌, పూజా రామ్‌చంద్రన్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో పూర్ణ విలన్‌గా నటించింది. మొదటిసారి నెగిటివ్‌ రోల్‌ చేస్తున్న పూర్ణ..ఈ సినిమాలో డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిగా కనపించనున్నారు.

సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పూర్ణ..ఈ సినిమాతో తాను కొత్తగా కనిపిస్తానని, మొదటిసారి నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు చెప్పింది. ఇందులో డ్రగ్‌ అడిక్ట్‌గా కనిపిస్తానని, ఇందుకోసం చాలా కష్టపడ్డానని, డ్రగ్స్‌ ఎలా తీసుకోవాలో తనకు తెలియక పోవడంతో షూటింగ్‌ సమయంలో కొంత ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో ముక్కుతో డ్రగ్‌ను పీల్చే సన్నివేశాలు ఉంటాయని, అయితే డ్రగ్స్‌ ఎలా తీసుకుంటారో తెలియక ఒక్కోసారి ఆ పౌడర్‌ ముక్కులోకి వెళ్లిపోయేదని తెలిపింది. ఈ క్రమంలో సెట్‌లో ఉన్న ఓ నటుడు డ్రగ్‌ను ఎలా పీల్చాలో నేర్పించాడని, అది చాలా హెల్ప్‌ అయ్యిందని చెప్పింది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా నేడు (మార్చి5)న విడుదల అయ్యింది.

చదవండి : (రియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సోనం)
(మీపై ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేను!)


 

మరిన్ని వార్తలు