ఆ టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా?.. నెటిజన్‌పై మండిపడ్డ హీరో

17 Jul, 2021 19:29 IST|Sakshi

‘బాయ్స్‌’ సినిమాతో హీరోగా కెరీర్‌ మొదలుపెట్టిన, ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మ‌రిల్లు’తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించాడు నటుడు సిద్దార్థ్‌. ప్రత్యేకంగా బొమ్మరిల్లు లాంటి బ్లాక్‌ బస్టర్‌తో యూత్‌లో విపరీతంగా ఫాలోయింగ్‌ వచ్చేసింది మనోడికి. అయితే ఆ త‌ర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. దీంతో కొన్నాళ్లుగా ఈ హీరోకి తెలుగులో సినిమా ఆఫ‌ర్స్ తగ్గడంతో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిమితం అయ్యాడు. తాజాగా సిద్దార్థ్‌ వయసు పై ఓ నెటిజన్‌ ట్రోలింగ్ చేయగా, దానికి ఘటుగానే బదులిచ్చాడు. 

వయసు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా?
ఏ అంశం అయినా, ముక్కుసూటిగా మాట్లాడుతూ ఈ నటుడు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా సిద్ధార్థ్‌ మరో వివాదాస్పద ట్వీట్‌తో నెట్టింట వార్తల్లో నిలిచాడు. ఓ నెటిజ‌న్ సిద్ధార్థ్‌ వయసుకు సంబంధించి.. ‘40 ఏళ్లు పైబడిన సిద్ధార్త్‌తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ ట్వీట్ చేసి అతనికే ట్యాగ్ చేశాడు. ఈ టీట్‌పై సిద్ధార్థ్‌ కూడా ఘాటుగానే జవాబిచ్చాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ టీట్‌ వైరల్‌గా మారి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. 

ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ‘మహాసముద్రం’ చిత్రంలో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ధార్థ్ లుక్ విడుద‌లై అభిమానులను ఆకట్టుకుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు