యూనిట్‌ సభ్యులకు శింబు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

12 Jul, 2021 06:39 IST|Sakshi
దర్శకుడు వెంకట్‌ ప్రభుకు గిఫ్ట్‌ ఇస్తున్న శింబు  

తమిళసినిమా: మానాడు చిత్ర యూనిట్‌ సభ్యులను నటుడు శింబు ఖుషీ పరిచారు. శింబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మానాడు, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. సమకాలిన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శనివారంతో పూర్తయింది.

దీంతో చిత్ర యూనిట్‌ కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. శింబు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌తో చిత్ర యూనిట్‌ సభ్యులను ఖుషీ పరిచారు. ఆయన దర్శకుడు వెంకట్‌ప్రభు నుంచి 300 మంది యూనిట్‌ సభ్యులకు ఖరీదైన వాచీలను కానుకగా అందించారు.  

మరిన్ని వార్తలు