విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో పెట్టలేం: సోనూ సూద్‌

26 Aug, 2020 11:38 IST|Sakshi

ముంబై : జేఈఈ, నీట్‌ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్‌, సెప్టెంబర్‌13న నీట్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ సెప్టెంబర్‌ 27న జరగనున్నాయి. ఈ పరీక్షలకు 26 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మరోవైపు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దని, పరీక్షలను వాయిదా వేయాలని దేశ  వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (సోనూ సూద్‌ మనసు బంగారం )

ఈ క్రమంలో జేఈఈ, నీట్‌ పరీక్షల వాయిదాపై నటుడు సోనూ సూద్‌ స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. ‘ఒక వైపు కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి, మరో వైపు ముంచెత్తుతున్న వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) నిర్వహించడం సరైంది కాదు. విద్యార్థుల విషయంలో శ్రద్ధ వహించాలి. వారి ప్రాణాలను రిస్క్‌లో వేయలేం. ఈ పరీక్షలను వాయిదా వేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.’ అని పేర్కొన్నారు. (వెల్‌డన్‌ హీరోస్‌: సోనూసూద్‌)

ఇదిలా ఉంటే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఎన్‌టీఏ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాదు ఎగ్జామ్‌ సెంటర్‌ల సంఖ్యను పెంచింది. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థితోపాటు అడ్మిట్‌ కార్డును మాత్రమే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రం వద్ద రద్దీని నియంత్రించేందుకు రిపోర్టింగ్‌ టైమ్‌ స్లాట్‌ను కేటాయిస్తారు. అభ్యర్థికి అడ్మిట్‌ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ​) త్వరలో విడుదల చేయనుంది. (మరోసారి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌)

మరిన్ని వార్తలు