తెరవెనుక మహేశ్‌, ప్రభాస్‌ అలా ఉంటారు : సుబ్బరాజు

19 Jun, 2021 13:17 IST|Sakshi

కార్తిక్‌ సుబ్బరాజు.. టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ.. సక్సెఫుల్‌ యాక్టర్‌గా కొనసాగుతున్న నటుల్లో ఒకడు. పాజిటివ్‌, నెగెటివ్‌ రోల్‌ అని తేడా లేకుండా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోతాడు కార్తిక్‌. ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ల సినిమాల్లో నెగెటివ్‌ రోల్‌ చేసి.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు 18 ఏళ్లుగా టాలీవుడ్ లో కొన‌సాగుతున్న ఈ యాక్ట‌ర్ తాజాగా సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌లు తెరవెనుక ఎలా ఉంటారో వెల్లడించాడు. 

ఇటీవల ఓ క్లబ్‌హౌస్‌ సెషన్‌లో భాగంగా సుబ్బరాజు ఈ స్టార్‌ హీరోల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మహేశ్‌బాబు చూడడానికి చాలా సున్నితంగా కనిపిస్తాడు కానీ ఆయన కచ్చితత్వం ఉన్న నటుడు అని కొనియాడాడు.ప్రతి విషయంలోనూ ఆయన స్పష్టత కోరుకుంటాడని, ఏ పని చేసినా ఫర్‌ఫెక్ట్‌గా చేయాలని కోరుకుంటాడని చెప్పాడు.

ఇక ప్రభాస్‌ గురించి చెబుతూ.. ‘ఆయన చూడడానికి కఠినంగా కనిపించినా.. చాలా సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి. ఆయనతో కలిసి పని చేయడం సరదాగా ఉంటుంది’అని సుబ్బరాజు అన్నాడు. కాగా, మహేశ్‌బాబుతో కలిసి సుబ్బరాజు ‘పోకిరి’,‘దూకుడు’,‘బిజినెస్‌మేన్‌’, ‘శ్రీమంతుడు’చిత్రాల్లో నటించాడు. అలాగే ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బుజ్జిగాడు, మిర్చి చిత్రాలలో నటించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు