‘కలర్‌ ఫోటో’కు జాతీయ అవార్డు.. హీరో సుహాస్‌ ఏమన్నాడంటే..

22 Jul, 2022 17:31 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్‌ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది.  ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ అవార్డు గెలుచుకుంది. ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా 2020లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

కలర్‌ ఫోటోకు జాతీయ అవార్డు దక్కిన సందర్భంగా సినిమా హీరో సుహాస్‌ తన ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. కలర్‌ ఫోటోకు జాతీయ స్థాయిలో అవార్డు లంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమాకు అవార్డు వస్తుందని ఊహించలేదని, హీరోగా చేసిన మొదటి సినిమాకే అవార్డు దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు సినిమాకే దక్కుతుందని, ఎప్పుడైనా సినిమానే గెలుస్తుందన్నారు.

అవార్డు వచ్చిన విషయం తనకు తెలియదని, ముందుగా డైరెక్టర్‌ సందీప్‌యే కాల్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్పారని అన్నారు. ప్రస్తుతం మిగతావారు కూడా కాల్‌ చేస్తున్నారని సుహాస్‌ తెలిపారు. సినిమా విడుదలైన సమయంలో దక్కిన ఆనందం.. ఇప్పుడు నేషనల్‌ అవార్డు వచ్చిన తర్వాత అంతే ఆనందంగా ఫీల్‌ అవుతున్నట్లు పేర్కొన్నారు. క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌కే చెందుతున్నారన్నారు. సినిమాకు పనిచేసిన వాళ్లందరికి ఈ అవార్డు అంకితమని అన్నారు.
చదవండి: కలర్‌ ఫోటో సినిమాకు జాతీయ అవార్డు

మరిన్ని వార్తలు