నీళ్లు తాగితే బయటకు వచ్చేవి, కడుపు నొప్పి: నటుడు

20 Aug, 2021 13:43 IST|Sakshi

డిజిటల్‌ కాలంలో కూడా చేతబడులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుటు, విలన్‌ టార్జాన్‌ అలియాస్‌ ఎదిరె లక్ష్మినారాయణ గప్తా. రామ్‌ గోపాల్‌ వర్మ ‘గాయం’ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన ఆ తరువాత క్యారక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా వందల సినిమాల్లో నటించాడు. ఈ క్రమంతో తన భార్య మరణంతో నటనకు బ్రేక్‌ ఇచ్చిన టార్జాన్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ రంగంలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు లక్‌ కూడా ఉండాలన్నాడు.

చదవండి: తండ్రి బర్త్‌డేకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్న సుస్మిత కొణిదెల

‘దేవుడు దయ వల్ల నన్ను ప్రేక్షకులు ఆదరించారు. అలా 30 ఏళ్లపాటు సినిమాల్లో నటుడిగా కొనసాగాను. సినీ కేరీర్‌ పరంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాని అనుకోని పరిస్థితుల వల్ల మధ్యలో బిబినెస్‌ మొదలు పెట్టాను. ఎందుకంటే మొదట్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుకు రూ. 2వేలు మాత్రమే ఇచ్చేవారు. అవి సరిపోక వ్యాపారం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. ఇక తనన కుటుంబం గురించి చెప్పుకొస్తూ..  తనది ఆంధ్రప్రదేశ్‌లోని పరిగి సమీపంలో రాపోలు అనే పల్లెటూరని చెప్పాడు. ‘మేము ముగ్గురం అన్నదమ్ములం. మా నాన్న ఊరి సర్పంచ్‌గా చేసేవారు. ఈ క్రమంలో మేమంటే పడని వారు, మా దగ్గరి బంధువులే మా కుటుంబానికి చేతబడి చేశారు. దీనివల్ల రెండేళ్లు అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం’ అంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నాడు. 

చదవండి: బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు

అంతేగాక ‘చేతబడి ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. మా అమ్మ, నాన్న, అన్నయ్య, నాకు చేతబడి చేశారు. దీంతో మా అన్నయ్య ఏం తిన్నా వాంతులు చేసుకునేవాడు. నాకు అయితే నీళ్లు తాగిన వెంటనే బయటకు వచ్చేవి.  కడుపు నొప్పి అయితే చాలా తీవ్రంగా ఉండేది. అలా మేము 13 ఏళ్లు నరకం చూశాం. అన్ని నష్టాలే దీంతో ఉన్నవి అన్ని అమ్మేసి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఇక్కడ వచ్చాక డబ్బులు లేక తినడానికి తిండి దొరక్క కష్టాలు పడ్డాం. దీంతో ఏ పని దొరికితే అది చేసేవాళ్లం. ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ ప్రారంభించాం. ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది’ అని పేర్కొన్నాడు. అయితే ఇప్పటికీ తన సొంత గ్రామానికి వెళ్లినప్పుడు అనారోగ్యం బారిన పడతానని. అక్కడ నీళ్లు తాగితే వెంటనే బయటకు వస్తాయని, కడుపు నొప్పి వస్తుందని చెప్పాడు. ఇప్పటికీ చేతబడులు ఉన్నాయని, మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు అన్నాడు. అమావాస్య,  పౌర్ణమిలను నమ్మినప్పుడు చేతబడి ఉందని కూడా నమ్మాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: అయ్య బాబోయ్‌..అషురెడ్డితో ఆర్జీవీ అలా.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు