యశవంతపుర: కరోనా సమయంలో నటుడు ఉపేంద్రకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక పుట్టింది. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖను ప్రజలకు రాశారు. ఆ లేఖ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నాకు సీఎం కావాలని ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపిస్తారా’ అంటూ లేఖ రాశారు. తాను రాజకీయాల్లోకి వస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటానని పేర్కొన్నారు. సీఎం (కామన్ మ్యాన్) అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తానని చెప్పారు.
ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటానన్నారు. ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని ఆ లేఖలో ఉప్పి పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వరుణ్ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించబోతున్నట్లు టాక్
Upendra CM of Karnataka? pic.twitter.com/OkgPfgm9ab— Upendra (@nimmaupendra) May 22, 2021