Actor Uttej: నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కన్నుమూత

13 Sep, 2021 09:50 IST|Sakshi

ప్రముఖ నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవల బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు.

దీంతో ఉత్తేజ్‌కు, ఆయన కుటుంబసభ్యులకు సినీ ప్రముఖులు, సహా నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక  ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్‌ రాజ్‌, జీవిత రాశేఖర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖు బసవతారకం ఆసత్రికి వెళ్లి అక్కడ ఉత్తేజ్‌ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు