Venu Thottempudi: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే..

7 Jul, 2022 12:56 IST|Sakshi

నటుడు వేణు తొట్టెంపూడి గుర్తున్నాడు కదా.. ‘స్వయంవరం’ సినిమాతో తెరంగేట్రం​ చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత చిరు నవ్వుతో, గోపి గోపిక.. గోదావరి వంటి చిత్రాల్లో లీడ్‌ రోల్‌ పోషించిన ఆయన.. తనదైన శైలిలో ఫిలాసఫి డైలాగ్‌లు చెబుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక హనుమాన్‌ జంక్షన్‌, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా వంటి సినిమాల్లో సహానటుడిగా కామెడీ పండిస్తూ ప్రేక్షకలును ఆకట్టుకున్నాడు. అలా హీరోగా, కమెడియన్‌గా తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు.

చదవండి: ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్‌ అప్పారావు

చివరిగా దమ్ము, రామాచారి చిత్రాల్లో కనిపించిన ఆయన ఆకస్మాత్తుగా తెరపై కనుమరుగయ్యాడు. దాదాపు పదేళ్ల తర్వాత వేణు రవితేజ రామారావు ఆన్‌డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. నిన్న(జులై 6న) ఈ మూవీలోని వేణు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అతడు సీఐ మురళిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో వేణు సోషల్‌ మీడియా వేదికగా ఓ చానల్‌తో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రామారావు ఆన్‌డ్యూటీ మేకర్స్‌ ఎస్ఎల్‌వీ సినిమాస్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

‘చాలా కాలం తర్వాత మళ్లీ నటించడం ఎలా ఉందిని అనే ప్రశ్నకు.. తానేప్పుడు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నాడు. ‘చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నటనకు దూరంగా ఉన్నా. మళ్లీ ఇంతకాలానికి రామారావు ఆన్‌డ్యూటీతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను సీఐ మురళిగా కనిపిస్తాను. దీనికి సంబంధించిన పోస్టర్‌ కూడా విడుదలైన విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం రామారావు ఆన్‌డ్యూటీతో పాటు పారా హుషార్‌ అనే మరో సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: మైనర్‌ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. ప్రముఖ నటుడు అరెస్ట్‌

‘అయితే మొదట ఈ మూవీలో నటించమని దర్శకుడు శరత్‌ మండవ చాలాసార్లు ఫోన్‌ చేశారు. కానీ నేను ఒప్పుకోలేదు. అసలు నటించనని చెప్పాను. మీరు ఈ సినిమాలో నటించకపోయిన పర్వాలేదు. కానీ ఓసారి కలుద్దాం’ అని శరత్‌ మెసేజ్‌ చేశారు. దీంతో ఓసారి మీట్‌ అయ్యాం. ఆ ముచ్చట్లలో భాగంగా ఈ చిత్రంలోని మీ పాత్రను ఇలా అనుకుంటున్నా. మీకు నమ్మకం ఉంటే చేయండి అన్నారు. నాకూ ఆ పాత్ర నచ్చింది. రెండు మూడుసార్లు శరత్‌తో నా పాత్రపై చర్చించి ఒకే చేశాను. అంతకుముందు కూడా పలు కథలు విన్నాను. కానీ, అనుకోకుండా ఇది ఫైనల్‌ అయ్యింది’ అని వేణు తెలిపాడు. 

A post shared by SLV Cinemas (@slv_cinemas)

మరిన్ని వార్తలు