‘ఓరుగల్లు’ ఘనత మీద విజయ్‌ దేవరకొండ ట్వీట్‌

11 Jul, 2021 08:16 IST|Sakshi

తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్‌ ఇండియన్‌ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్‌లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్‌ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్‌లో ఒక పోస్ట్‌ చేశాడు. 

‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్‌ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు.

కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్‌ హెరిటేజ్‌ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో  బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్‌ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు