కంగనాను భగత్‌ సింగ్‌తో పోల్చిన హీరో

10 Sep, 2020 20:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ ఆత్మహత్య నేపథ్యంలో మొదలైన వివాదం తర్వాత అనేక మలుపులు తిరిగింది. డ్రగ్స్‌ వినియోగం వెలుగులోకి రావడం.. అనంతరం కంగనా బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని ఆరోపించడం.. ఆ తర్వాత ముంబైని పీఓకేతో పోల్చడంతో వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో కేంద్రం కంగనాకు వై ప్లస్‌ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్‌లో జరుగుతున్న ఈ పరిణామాలపై దక్షిణాది హీరో విశాల్‌ స్పందించారు. కంగనాపై ప్రశంసలు కురిపించడమే కాక ఆమెను ఏకంగా భగత్‌ సింగ్‌తో పోల్చారు. ఈ మేరకు విశాల్‌ ట్వీట్‌ చేశారు. ‘మీ ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్‌.. ఓ విషయం గురించి మాట్లాడటానికి మీరు రెండు సార్లు ఆలోచించలేదు. ఏది తప్పు.. ఏది ఒప్పు అని బేరీజు వేయలేదు. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు. అయినా ప్రభుత్వ ఆగ్రహాన్ని ఎదుర్కొంటూనే.. మీరు బలంగా నిలబడ్డారు. ఇది చాలా పెద్ద ఉదాహరణ. మీరు చేసిన ఈ పని.. గతంలో అంటే 1920లో భగత్‌సింగ్‌ చేసినదానికి సమానమైనది’ అంటూ ప్రశంసించారు విశాల్‌. (చదవండి: కంగనాను బెదిరించలేదు: సంజయ్‌ రౌత్‌)

అంతేకాక ‘తప్పు జరగినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే సెలబ్రిటీనే కావాల్సిన అవసరం లేదు.. ఓ కామన్‌ మ్యాన్‌ కూడా చేయవచ్చు అని నిరూపించారు. నేను మీకు నమస్కరిస్తున్నాను’ అంటూ విశాల్‌ ట్వీట్‌ చేశారు. ప‌లు సామాజిక అంశాల ప‌ట్ల త‌న గ‌ళాన్ని విప్పే విశాల్.. ఇలా కంగ‌నాకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డంపై ఇండ‌స్ట్రీలో ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా