Vishal: 'అప్పుడే నాకు తెలుగు డబ్బింగ్‌ వస్తుంది'

21 Sep, 2021 21:18 IST|Sakshi

Actor Vishal Dubs For Enemy: యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమీ’.ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

తాజాగా హీరో విశాల్‌ ఈ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లాగా ఇలా చేతులు ఊపుకుంటూ ఉంటేనే నాకు తెలుగులో డబ్బింగ్‌ వస్తుంది అంటూ విశాల్‌ ఫన్నీ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్‌ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు