ప్రముఖ హాస్యనటుడికి గుండెపోటు, పరిస్థితి విషమం

16 Apr, 2021 12:59 IST|Sakshi

గురువారం వ్యాక్సిన్‌ తీసుకున్న వివేక్‌

గుండెపోటుతో శుక్రవారం ఆసుపత్రిలో చేరిక

సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్  (59) తీవ్ర  అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం  రేపింది. అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.  ప్రస్తుతం ఎక్మో ట్రీట్‌మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల బృందం  ఆయన ఆరోగ్యాన్ని  నిశితంగా పర్యవేక్షిస్తోంది  

కాగా చెన్నై ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ గురువారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా  వైద్యులు,  సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్‌  చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు