ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆ‍స్కార్‌కి నామినేట్‌ చేయకపోవడం అన్యాయం : నటుడు

22 Sep, 2022 16:45 IST|Sakshi

'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను ఆస్కార్‌కి నామినేట్‌ చేయకపోవడం అన్యాయమని నటుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వై.కాశీ విశ్వనాథ్ అన్నారు. దేశ భక్తిని చాలాచెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ ఫిక్షన్‌ యాంగిల్‌లో, కల్పిత కథతో ఎంతో కష్టపడి అద్భుతంగా తెరకెక్కించిన  సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. కంటెంట్‌ పరంగా కానీ, సందేశం పరంగా కానీ దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసే సినిమా ఇది.

సీన్స్‌ను రక్తికట్టించడంలో కానీ, నటీనటల నుంచి పర్ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో కానీ రాజమౌళి ప్రాణం పెట్టి పనిచేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు అయితే తమ పాత్రల్లో జీవించారు. టెక్నీషియన్స్‌ ప్రతిభ అమోఘం. ఇన్ని ఉన్నా ఆర్‌ఆర్‌ఆర్‌ని ఆస్కార్‌కి నామినేట్‌ చేయకుండా చెల్లో షో అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్‌ చేయడం, తెలుగు సినిమాను పట్టించకోకుపోవడం శోచనీయం. దీన్ని ఖండిస్తూ తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు