Aishwarya Lakshmi Financial Condition: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య

17 Jun, 2022 09:06 IST|Sakshi

సీనియర్‌ నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య

ఒక్క పూటే భోజనం చేస్తున్నా: ఐశ్వర్య

మీ ఆఫీసులో జాబ్‌ ఇస్తానంటే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తా: ఐశ్వర్య

ప్రముఖ సీనియర్‌ నటి కూతురు. పలువురు స్టార్‌ హీరో సరసన హీరోయిన్‌గా చేసింది.. సహా నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. అంతటి నేపథ్యం ఉన్న ఆమె ప్రస్తుతం స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తూ దర్జాగా జీవిస్తూ ఉంటుందని అందరు అనుకుంటారు. కానీ ఆమె కనీసం మూడు పూటలా సరిగా తినలేని స్థితిలో ఉందంటే నమ్ముతారా? పూట గడవడం కోసం ఈ స్టార్‌ నటి ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటూ సేల్స్‌గర్ల్‌గా మరింది. ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడంతో అంతా షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్‌ నటి ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు సీనియర్‌ హీరోయిన్‌, నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య భాస్కరన్‌.

చదవండి: Sai Pallavi: నటి సాయిపల్లవిపై ఫిర్యాదు 

ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ తన ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది. ప్రముఖ నటి లక్ష్మి కూతురుగా సినీరంగ ప్రవేశం చేసింది ఐశ్వర్య భాస్కరన్‌. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి నటిగా ప్రత్యేక గుర్తింపు పొందింది. 1989లో వచ్చిన అడవిలో అభిమన్యుడు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌ పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస పెట్టి సినిమా ఆఫర్లు అందుకుంది. మోహన్‌లాల్‌తో హిట్ సినిమాలైన బటర్‌ఫ్లైస్, నరసింహమ్, ప్రజా వంటి వాటిలో నటించింది.

చదవండి: ‘విరాటపర్వం’ మూవీ రివ్యూ

ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు కరువైన నాని వంటి చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు చేసి మెప్పించింది. అంతేకాదు పలు టీవీ సీరియల్స్‌లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆఫర్లు లేకపోవడంతో ఆమె సబ్బులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్టు స్యయంగా ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నాకు పని లేదు. డబ్బు లేదు. అలాగనీ అప్పులేమీ లేవు. వీధుల్లో సబ్బులు అమ్ముతూ బతుకుతున్నాను. ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేనొక్కదానినే ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనిచేయడానికైనా నేను ఆలోచించను.

చదవండి: ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్‌ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్‌

రేపు మీ ఆఫీసులో జాబ్ ఇస్తానంటే తప్పకుండా చేస్తా. అవసరమైతే టాయిలెట్స్ కూడా క్లీన్ చేస్తా’ అని పేర్కొంది. ‘నేను నటించడం ప్రారంభించిన మూడేళ్ల పాటు కెరీర్ బాగా సాగింది.. ఇంతలోనే పెళ్లయింది. ఆ తర్వాత క్రమంగా సినీ ఇండస్ట్రీకి దూరమవాల్సి వచ్చింది. హీరోయిన్‌గా అందరికి సెకండ్ ఇన్నింగ్స్ నయనతారలా ఉండదు. ప్రస్తుతం నేను ఇండిపెండెంట్‌గా ఉన్నాను. యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ సబ్బులు అమ్ముతున్నాను. నేను ఇండిపెండెంట్‌గా ఉన్నందుకు గర్వంగా ఉన్నాను. అయితే ఆర్థికంగా నేను నిలదొక్కుకోవాలంటే నాకు ఇప్పుడు ఓ మెగా సీరియల్‌ ఆఫర్‌ కావాలి’ అంటూ ఐశ్వర్య  చెప్పుకొచ్చింది. 

మరిన్ని వార్తలు