పాన్ ఇండియా మూవీ నటి.. ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టగలరా?

5 Mar, 2023 01:00 IST|Sakshi

ఇప్పటి హీరోయిన్లు గ్లామర్‌ ప్రపంచంలో పోటీపడుతూ దూసుకెళ్తున్నారు. అందివచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోవట్లేదు. దక్షిణాదిలో ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా సూపర్‌ హిట్స్ అందుకుంటున్నారు. డబ్బింగ్ సినిమాలతో వచ్చి.. సక్సెస్ సాధించిన హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నటించి సక్సెస్ అయి అలా వచ్చిన వారిలో ఈ ఫోటోలోని చిన్నారి కూడా ఒకరు. ఇటీవలే టాలీవుడ్‌లో ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ ఫోటోలోని చిన్నారిని మీరు గుర్తుపట్టారా?

ఆ ఫోటోలోని పాలబుగ్గల చిన్నారి మరెవరో కాదు ఇటీవలే వచ్చిన మట్టీ కుస్తీలో కనిపించిన ఐశ్వర్య లక్ష‍్మి.  పొన్నియిన్ సెల్వన్‌, అమ్ము, మట్టి కుస్తీ  సినిమాలతో ఫేమ్ సంపాదించుకుంది మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి. మణిరత్నం సినిమాతో ఒక్కసారిగా ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.   కేరళకు చెందిన ఐశ్వర్య లక్ష్మి మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టంది.  గతేడాది సత్యదేవ్ సరసన ‘గాడ్ సే’ మూవీతో తెలుగులో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’లో మెరిసింది. అలాగే మట్టికుస్తీ, అమ్ము వెబ్ సిరీస్‌లతో మంచి ప్రశంసలు దక్కించుకుంది. 


 

మరిన్ని వార్తలు