Aishwarya Sakhuja: మొదట్లో కన్ను గీటాను, చివరికి పక్షవాతం అని తేలింది

20 Jun, 2022 17:56 IST|Sakshi

రామ్‌సే హంట్‌ సిండ్రోమ్‌.. ఇది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల ముఖభాగం పక్షవాతానికి గురవుతుంది. ప్రతి లక్ష మందిలో 5 నుంచి 10 మంది ఈ వ్యాధి బారిన పడుతారు. ఇటీవలే స్టార్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ తాను రామ్‌సే హంట్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. తాజాగా బుల్లితెర నటి ఐశ్వర్య సఖుజ మాట్లాడుతూ.. తాను కూడా రామ్‌ సే హంట్‌ బాధితురాలినేనని చెప్పుకొచ్చింది.

'ఇది 2014 నాటి సంగతి. షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నాను. నాకు గుర్తున్నంతవరకు అప్పుడు నేను మధ్యాహ్నం రెండు గంటల షిఫ్ట్‌కు వెళ్లాను. రోహిత్‌(ఐశ్వర్య భర్త) ఎందుకు కన్ను కొడుతున్నావంటూ అడిగాడు. ఏదో జోక్‌ చేస్తున్నాడనుకుని లైట్‌ తీసుకున్నాను. కానీ తర్వాతి రోజు ఉదయం పళ్లు తోముకునేటప్పుడు విపరీతమైన నొప్పి వచ్చింది. తర్వాత నా రూమ్‌మేట్‌ నా ముఖం మారిపోతున్నట్లు గ్రహించింది. నేను వెంటనే డాక్టర్‌ను కలిశాను. అప్పుడు నాకు రామ్‌సే హంట్‌ వ్యాధి ఉన్నట్లు తెలిసింది.

కానీ నేను ఒప్పుకున్న షెడ్యూల్స్‌ కారణంగా విశ్రాంతి తీసుకోలేదు. నా ముఖం సగం కనిపించకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్స్‌ చేశారు. తర్వాత స్టెరాయిడ్స్‌ ఇచ్చి వైద్యం అందించారు. నటిగా అందంగా కనిపించడం ఎంతో ముఖ్యం. తిరిగి నార్మల్‌ అవుతానో లేదోనని భయపడ్డాను. కానీ నెల రోజుల్లోనే ఈ వ్యాధి నుంచి కోలుకున్నాను. జస్టిన్‌ బీబర్‌ కూడా దీన్నుంచి తప్పకుండా బయటపడతాడు' అని చెప్పుకొచ్చింది. కాగా ఐశ్వర్య చివరగా 2019లో 'ఉజ్దా చమాన్‌' సినిమాలో ఏక్త పాత్రలో నటించింది. 'సాస్‌ బీనా ససురాల్‌', 'ఆషికి', 'త్రిదేవియాన్‌', 'యే హై చహతే' వంటి పలు సీరియల్స్‌ చేసింది.

A post shared by Aishwarya Sakhuja (@ash4sak)

చదవండి:  షూలతో ఆలయంలోకి హీరో? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌
పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ?

మరిన్ని వార్తలు