Actress Alankrita Sahai: పట్టపగలే నటి ఇంట్లో దొంగతనం.. రూ.6 లక్షల చోరీ

8 Sep, 2021 13:31 IST|Sakshi

ఇటీవల దొంగలు పట్టపగలే ఇళ్లలోకి దూరి మరి దోచుకొవడం ఎక్కువైంది.  సామాన్యులనే కాదు సెలబ్రీటీలను సైతం వదలడం లేదు. అటువంటి సంఘటనే మంగళవారం (సెప్టెంబర్‌ 7న) చంఢీగర్‌లో చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు నటి, మోడల్‌ అలంకృత సహాయ్‌ని బంధించి దాదాపు 6 లక్షల వరకు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. మోడల్‌, నటి అలంకృత తన తల్లిదండ్రుల కోసం ఇటీవల చంఢీగర్‌లోని సెక్టార్‌ 27లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఢిల్లీలో ఉన్న వాళ్లు రెండు, మూడు రోజుల్లో ఇక్కడికి షిఫ్ట్‌ కావాల్సింది. ఈ తరుణంలో మంగళవారం అలంకృత అక్కడి వచ్చి ఏర్పాట్లను పరిశీలించింది. ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన  దుండగులు బలవంతంగా అలంకృత ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు.

దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఒకరు ఆమె ఏటీఎం కార్డుని తీసుకెళ్లి రూ.50 వేలు విత్‌డ్రా చేశాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు అలంకృతను బంధించి, అరిస్తే చంపేస్తామని బెదిరించారు. అంతేకాదు ఇంట్లో ఉన్న నగలు, నగదును కూడా తీసుకెళ్లారు. మొత్తంగా దాదాపు 6 లక్షల వరకు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. 

ముగ్గురిలో ఒకడు అతనే..
మూడు రోజుల క్రితం అలంకృత  ఫర్నిచర్‌ కొనగా, ఆదివారం వాటిని డెలివరీ చేశారు. ఆ డెలివరీకి వచ్చిన వారిలో ఒకరు ఈ ముగ్గురిలో ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.పోలీసుల ఫిర్యాదులో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు