Amala Paul: అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్‌ సంఘటన!

18 Jan, 2023 10:13 IST|Sakshi

నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని అమ్మవారి దర్శనానికి వెళ్లిన ఆమెను ఆలయ అధికారులు అడ్డుకున్న సంఘటన స్థానికంగా వివాదస్పమైంది. వివరాలు.. కేరళలోని ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర మతస్తులకు అనుమతి ఉండదు. ఈ క్రమంలో రీసెంట్‌గా తన స్నేహితులతో అమలాపాల్‌ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎర్నాకుళం ఆలయానికి వెళ్లింది. క్రిస్టయన్‌ మతస్తురాలైన అమలాను అక్కడ ఆలయ అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

చదవండి: అరుదైన వ్యాధి.. పోరాటంలో విజయం మాదే అంటున్న అందాల తారలు

దీంతో నిరాశ చెందిన ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో నోట్‌ రాసింది. ‘అన్యమతస్థురాలిని అని నాకు ఆలయంలో అనుమతి ఇవ్వలేదు. నేను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించాను. అమ్మవారి శక్తిని ఫీల్‌ అయ్యాను.  కానీ నన్ను ఆలయంలోకి అనుమతించకపోవడంతో  తీవ్ర నిరాశకు గురయ్యాను. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరం. ఈ వివక్షలో త్వరలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే సమయం రావాలని కోరుకుంటున్నా’ అని అమలా పేర్కొంది.

చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని

ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా వివాదస్పదంగా మారింది. దీనిపై పలు సామాజికి సంఘాలు, ప్రముఖుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తు‍న్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్‌ కార్యదర్శి ప్రసూన్‌ కుమార్‌ ఈ ఘటనపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉ‍న్న ప్రోట్‌కాల్‌ను మాత్రమే మేం పాటిస్తున్నామన్నారు. ఇతర మతాలకు చెందిన వారు కూడా రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కానీ అది ఎవరికి తెలియదు. ఇప్పుడు వచ్చింది ఒక సెలబ్రెటి కాబట్టి ఇది వివాదస్పదం అయ్యింది’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు