మరోసారి బోల్డ్‌ పాత్రలో...

13 Aug, 2020 00:26 IST|Sakshi
అమలాపాల్

హోమ్లీ పాత్రల్లోనే కాదు.. పాత్ర డిమాండ్‌ చేస్తే గ్లామరస్‌ రోల్‌లో నటించడానికి వెనకాడరు అమలాపాల్‌. ఆ మధ్య ‘ఆమె’ చిత్రంలో బోల్డ్‌గా నటించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారామె. తాజాగా మరోసారి ఓ బోల్డ్‌ పాత్రలో నటించేందుకు పచ్చజెండా ఊపారట. అయితే సినిమాలో కాదు.. ఓ వెబ్‌ సిరీస్‌ కోసం కావడం విశేషం. 1970ల నాటి కథతో తెలుగు, తమిళ భాషల్లో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కనుంది.

అప్పటి పరిస్థితుల్ని తెలిపే నవల ఆధారంగా ఈ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందించనున్నారు. ఇందులో అమలాపాల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే బాలీవుడ్‌లో మహేష్‌ భట్, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారు. దీని ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అమలాపాల్‌.

మరిన్ని వార్తలు