పవన్‌ కల్యాణ్ అడిగితే.. ఆయనకు 4వ భార్యగా ఉంటా..

3 Mar, 2021 08:55 IST|Sakshi

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, నటి అషూ రెడ్డి..తాను పవన్‌ కల్యాణ్‌ వీరాభిమానినని చాలా సార్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఎంతగానో ఆరాధించే పవన్‌ను కలిసే అవకాశం వరించింది. ఇద్దరూ ఓకే చోట షూటింగ్‌ చేస్తుండటంతో వెంటనే పవన్‌ సెట్‌లోకి వాలిపోయింది అషూ రెడ్డి. ఈ సందర్భంగా ఆయనతో తీసుకున్న ఫోటోను షేర్‌ చేసిన అషూ..'నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. ఆయన నాతో పాటు నేను వేసుకున్న టాటూ కూడా గుర్తుందని చెప్పారు. దాదాపు 2 గంటలు మాట్లాడుకున్నాం. ఎంతో సంతోషంగా అనిపించింది. తిరిగి వెళ్లేటప్పుడు ఓ స్వీట్‌ లెటర్‌ కూడా ఇచ్చారు. మీరు ఎప్పటికీ నా ఫస్ట్‌ లవ్‌ పవన్‌ కళ్యాణ్‌' అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. ఇంత మంచి  అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్‌కు కృతఙ్ఞతలు అంటూ పేర్కొంది.

అశ్విని అలియాస్‌ అషూ రెడ్డి
'మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను' అంటూ స్వయంగా  పవన్‌ రాసిన లేఖను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.  ఈ సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పవన్‌ కల్యాణ్‌తో రెండు గంటలు అపాయింట్‌మెంట్ అంటే మామూలు విషయం కాదు.. అంత సమయం నీకెలా దొరికొందంటూ కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా..ఓ నెటిజన్‌ నుంచి ఆమెకు ఊహించిన ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ పవన్‌ కల్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా’? అని ప్రశ్నించగా తప్పకుండా ఓకే చెబుతానంటూ బదులిచ్చింది. ఆషూ ఆన్సర్‌తో దిమ్మతిరిగిన నెటిజన్లు..ఈ కామెంట్‌ను స్క్రీన్ షాట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

గతంలోనూ పవన్‌ కల్యాణ్‌ పేరుని అషూ..తన ప్రైవేట్ పార్ట్ పై పచ్చబొట్టు వేయించుకొని హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జూనియర్‌ సమంతలా ఆ మధ్య సోషల్‌ మీడియా సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న ఆమె బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్‌ ఇచ్చింది. బొద్దుగుమ్మ నమితలా మారిపోయిందంటూ అషూపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వచ్చాయి. ఈ మధ్య సింగర్‌ రాహుల్‌తో లవ్‌ ఎఫైర్‌ నడుపుతుందంటూ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు తెగ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

చదవండి : (బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజకు పవన్‌ కళ్యాణ్‌ లేఖ‌)
(వైరల్‌ ఫొటో: అషూను ఎత్తుకున్న రాహుల్‌!‌)

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు