ప్రియుడితో నటి రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్‌

15 Feb, 2021 19:50 IST|Sakshi

ముంబై : ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో నటి దియా మీర్జా వివాహం జరిగింది. అతి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ముంబై బాంద్రాలోని నివాసంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఎరుపురంగు చీరలో దియా అందంగా ముస్తాబవగా, వైట్‌ అండ్‌ వైట్‌ కుర్తాలో వైభవ్‌ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతకుముందు మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను దియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ప్యార్‌ (ప్రేమ)అనే క్యాప్షన్‌ను జత చేసింది.


ఇక  గతేడాది నుంచి ప్రేమలో ఉన్న దియా-వైభవ్‌లు ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు. అయితే 39 ఏళ్ల దియా ఇది వరకే నిర్మాత సాహిల్‌ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011 నుంచి సహజీవనంలో ఉన్న వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకోగా  కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇక భర్తతో విడాకుల అనంతరం దియా వ్యాపారవేత్త అయిన వైభవ్‌ రేఖీతో ప్రేమలో ఉన్నట్లు గతేడాది గుసగుసలు వినిపించాయి.


ఈ నేపథ్యంలో దియా-వైభవ్‌లు‌ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఇటీవల ప్రకటించారు. వైభవ్‌కు కూడా ఇది రెండో పెళ్లి. అంతేకాకుండా దియా కంటే వైభవ్‌ నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం. సంజు, దమ్, దస్,  మై బ్రదర్ వంటి చిత్రాలతో పాపులర్‌ అయిన దియా మీర్జా  చివరిగా ఆమె దర్శకుడు అనుభవ్‌ సిన్హా రూపొందించిన ‘థప్పడ్‌’లో నటించారు. ఇందులో తాప్పీ లీడ్‌ రోల్‌ పోషించగా దియా సామాజిక కార్యకర్తగా, మహిళ సంఘ నాయకురాలి పాత్రలో కనిపించారు. ఇక ఆమె తెలుగులో మెదటిసారి నటించిన  ‘వైల్డ్‌ డాగ్’‌ లో కీ రోల్‌ పోషించారు. 

చదవండి : (ఫ్యాన్‌ మూమెంట్‌: విజయ్‌తో సారా సెల్పీ) 
(2013లో ఎంగేజ్మేంట్‌‌.. ఏడేళ్లు సహాజీవనం.. ఆ తర్వాత పెళ్లి..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు