గ్లామర్‌కు గేట్లు ఎత్తేసిన బ్యూటీ.. ఫోటోలు వైరల్‌

8 Jan, 2024 07:03 IST|Sakshi

రజనీకాంత్‌ చిత్రంలో 'పుష్ప' లాంటి ఐటెం సాంగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

ఫొటో షూట్‌ తర్వాత ఇన్‌స్టాలో గ్లామర్‌ ఫోటోలు షేర్‌ చేసిన బ్యూటీ

నటి దుషారా ఇప్పుడిప్పుడే కోలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఈమె చేసింది తక్కువ చిత్రాలే అయినా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో మెప్పించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా చక్కని నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఆ తరువాత మళ్లీ పా.రంజిత్‌ దర్శకత్వంలో నక్షత్రం నగరగిదు చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.

ఆ తరువాత కరువేక్తి ముహుర్తం, వసంత పాళెం దర్శకత్వంలో చిత్రాలు చేశారు. తాజాగా ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 50వ చిత్రంలో దుషారా నటిస్తున్నారు. అదే సమయంలో నటుడు రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టయ్యన్ చిత్రంలోని ప్రత్యేక పాటలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. కాగా ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా కనిపించిన దుషారా ఇప్పుడు గ్లామర్‌కు గేట్లు ఎత్తివేయటం విశేషం. ఇటీవల ఈమె ప్రత్యేకంగా ఫొటో షూట్‌ నిర్వహించుకుని తీయించుకున్న గ్లామరస్‌ ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

కాగా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న వేట్టయాన్‌ చిత్రంలో ఈ అమ్మడు ఐటెం సాంగ్‌లో నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు పుష్ప చిత్రంలో సమంత నటించిన ఊ అంటావా మామా పాట జైలర్‌ చిత్రంలో తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా పాట ఎంత పాపులర్‌ అయ్యాయో అంతకంటే ఎక్కువగా వేట్టైయాన్‌ చిత్రంలో దుషారా ఐటమ్‌ సాంగ్‌ పాపులర్‌ అవుతుందనే ప్రచారం ప్రస్తుతం కోలీవుడ్‌లో జోరందుకుంది.

A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan)

>
మరిన్ని వార్తలు