ఈ హీరోయిన్‌ ధరించిన గౌను స్పెషాలిటీ ఏంటో తెలుసా?

12 Aug, 2021 11:54 IST|Sakshi

ఓ హీరోయిన్‌ గౌను ధరించి ఫోటో దిగితే అది సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఆమె ఓ స్టార్‌ హీరోయిన్‌ అయితే... ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఆమె ప్రస్తుతం ఓచిన్న హీరోయిన్‌. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ చిన్న హీరోయిన్‌కి అప్పుడే అంత క్రేజా అనేగా మీ డౌటనుమానం? ఆమెకు ప్రస్తుతం అంత క్రేజ్‌ లేదు కానీ.. ఆమె ధరించిన గౌను వల్ల ఆ ఫోటో వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే..  విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన దృశ్యం సినిమా గుర్తుందా? అందులో వెంకటేశ్‌ చిన్న కూతురిగా నటించిన చైల్డ్‌ ఆరిస్ట్‌ పేరు ఎస్తర్‌ అనిల్‌. ఇప్పుడు ఆ చిన్నారి పెద్దదై హీరోయిన్‌గా మారేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ స్పెషల్‌ గౌనుతో ఫొటో షూట్‌ నిర్వహించింది. ఆ గౌను స్పెషల్‌ ఏంటంటే.. దాని బరువు.. ఆమె బరువు కంటే ఎక్కువ. ఎస్తర్‌  బరువు 44 కేజీలు. కానీ, ఆమె ధరించిన గౌను బరువు 58 కేజీలు. తన ఫోటోషూట్ పై ఎస్తర్‌ స్పందిస్తూ..  గౌను చూడగానే నచ్చిందని.. ఆ తర్వాత దానిని వేసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఆ గౌను తయారీకి దాదాపు 30 రోజులు కష్టపడ్డారని తెలిపింది

A post shared by Esther Anil (@_estheranil)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు