Faria Abdullah: జాతిరత్నాలులోని రోలే రావణాసురలో చేశా.. కానీ: ఫరియా అబ్దుల్లా

22 Mar, 2023 16:22 IST|Sakshi

‘‘నటిగా నా జర్నీపై నాకో స్పష్టత ఉంది. అందుకే సినిమాల ఎంపిక విషయంలో నాకు తొందర పాటు లేదు. చాన్స్‌లు వస్తాయా? రావా అనే భయం కూడా లేదు’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపోందిన చిత్రం ‘రావణాసుర’. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పోన్నాడ హీరోయిన్లుగా నటించారు.

రవితేజ, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 7న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో లాయర్‌ కనకమహాలక్ష్మి పాత్ర చేశాను. అయితే ‘జాతి రత్నాలు’లో చేసిన కామెడీ లాయర్‌లాంటి పాత్ర కాదు. కనకమహాలక్ష్మి సీరియస్‌గా ఉంటుంది. రవితేజగారు నాకు సీనియర్‌ లాయర్‌. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ్‌లో ఒక్కో సినిమా చేస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు