Gauahar Khan: అప్పుడే తల్లినవుతానంటున్న నటి!

5 Aug, 2021 14:08 IST|Sakshi

Gauahar Khan: బాలీవుడ్‌ నటి, మోడల్‌ గౌహర్‌ ఖాన్‌ తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 25న వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చారు. అందరిలాగే ఈ నటికి కూడా ఓ ప్రశ్న తరచూ ఎదురవుతోంది. పెళ్లైంది, మరి పిల్లల్ని ఎప్పుడు కంటావు? అన్న క్వశ్చన్‌తో నెటిజన్లు ఆమెను ఎటాక్‌ చేస్తున్నారు.

తాజాగా ఈ ప్రశ్నకు గౌహర్‌ ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా సమాధానమిచ్చింది. ఆ దేవుడు కరుణించినప్పుడు తప్పకుండా తల్లినవుతానని చెప్పుకొచ్చింది. మీ అత్తామామలతో ఎందుకు కలిసుండవు? అన్నదానికి నాకు, నా భర్తకు ఏది మంచి అనిపిస్తే అదే ఫాలో అవుతామని తెలిపింది. పెళ్లయ్యాక కూడా ఎందుకు పని చేస్తున్నావు? అన్న క్వశ్చన్‌కు 20 ఏళ్లుగా పని చేస్తున్నాను. 80 ఏళ్లు వచ్చేదాకా కూడా చేస్తూనే ఉంటా అని బదులిచ్చింది.

కాగా మాజీ మోడల్‌ అయిన గౌహర్‌ ఖాన్‌ 'ది ఖాన్‌ సిస్టర్స్‌ షో'లో ప్రముఖంగా కనిపించింది. రాకెట్‌ సింగ్‌, గేమ్‌, ఇషాక్జాడే వంటి చిత్రాలతో పాటు రియా‍ల్టీ టీవీ షోలైన జాహాలక్‌ దిఖ్లా జా3, బిగ్‌బాస్‌7, ఫియర్‌ ఫాక్టర్‌: ఖత్రోస్‌ కే ఖిలాడి5, ఇటీవల బిగ్‌బాస్‌14లో కూడా పాల్గొంది. జైద్‌ దర్బార్‌ విషయానికి వస్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ కుమారుడైన ఈయన వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

A post shared by Gauahar Khan (@gauaharkhan)

మరిన్ని వార్తలు