నటి గీతాంజలికి సైబర్‌ వేధింపులు

26 May, 2021 10:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొందరు పోకిరీలు తన ఫొటోను డేటింగ్‌ యాప్‌లో పెట్టారంటూ సినీ నటి గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్‌ యాప్‌లో తన చిత్రాలు పెట్టడంతో పాటు తనను తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయింది. తనకు అనేక ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని చెప్పిన నటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదు' అని పేర్కొంది. దీనిపై ఐపీసీ 501 సెక్షన్ కింద హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్‌ తెలిపారు. 

చదవండి: నారప్ప కంటే ముందుగా దృశ్యం- 2!

మరిన్ని వార్తలు