పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ

6 Apr, 2021 10:32 IST|Sakshi

ప్రముఖ నటి, యాంకర్‌ హరితేజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్‌ మీడియా ద్వారా తన సన్నిహితులతో, అభిమానులతో పంచుకుంది. గతేడాది ప్రెగ్నెన్సీ గురించి హరితేజ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండీ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ తో అభిమానులకు టచ్ లోనే ఉంది. ఏప్రిల్ 5న ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయాన్ని 'ఇట్స్ బేబీ గర్ల్' అంటూ హరితేజ తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

కాగా, బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ గుర్తింపుతో బిగ్‌బాస్‌ 1లోకి వెళ్లి తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. 2015లో ఆమె వివాహం జరిగింది.

A post shared by Hari Teja (@actress_hariteja)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు