Heroine Childhood Pic: ఒకప్పుడు అందంతో కుర్రకారు మతిపోగొట్టిన ఈ ‘రాక్షసి’ ఎవరో గుర్తు పట్టారా?

17 Dec, 2021 08:42 IST|Sakshi

ఈ చిన్నారి ఎవరో గుర్తపట్టారా? ఒకప్పుడు సౌత్‌లో తన అందం, అభినయంతో దక్షిణానా స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ప్రభాస్‌ నుంచి యంగ్‌ హీరో రామ్‌ పోతినేని వరకు తెలుగు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. జీన్స్‌,టీ-షర్ట్‌తో క్యూట్‌ క్యూట్‌గా ఫొటోకు ఫోజు ఇచ్చిన ఈ చిన్నారి ఎవరో  ఇప్పటికైనా గుర్తొచ్చిందా. అయితే మరో క్లూ మీకోసం. 

చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్‌ సాంగ్‌పై మాధవిలత షాకింగ్‌ కామెంట్స్‌

ప్రస్తుతం తనకు తెలుగులో ఆఫర్స్‌ లేకపోయిన ఆమె క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. అమాయకపు చూపులు, క్యూట్‌ స్మైల్‌, కవ్వించే వయ్యారంతో కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. ఈ మధ్య సినిమాలకు ​కాస్తా బ్రేక్‌ ఇచ్చిన ఈ భామ ఇటీవల తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు. దేవదాసు సినిమాతో సినీ తెరకు ప్రరిచయమైన గోవా బ్యూటీ ఇలియాన.

చదవండి: ‘పుష్ప’ మూవీకి తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

మొదటి సినిమాతోనే తన అందచందాలతో దర్శక-నిర్మాతల దృష్టి ఆకర్షించిన ఇలియాన.. ఆ తర్వాత వరసగా తెలుగు స్టార్‌ హీరోల సరసన నటించి బాక్సాఫీసు హిట్‌లు అందుకుంది.తెలుగులో దాదాపు స్టార్‌ హీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. ఆ తర్వాత ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ‘ది బిగ్ బుల్’ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. ‘తేరా క్యా హోగా లవ్లీ’ అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.

మరిన్ని వార్తలు