Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు బెయిల్‌

26 Sep, 2022 11:28 IST|Sakshi

Jacqueline Fernandez Bail: బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. 200కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్‌ మంజూరయ్యింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 22కి వాయిదా వేసింది. కాగా సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగాపేర్కొంటూ రెండో అనుబంధ ఛార్జిషీట్‌ను ఆగస్టు 17న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో సెప్టెంబర్‌ 26 కోర్టుల ఎదుట హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ అవగా, సోమవారం జాక్వెలిన్‌ న్యాయవాదితో కలిసి కోర్టుకు హాజరయ్యింది. ఈ క్రమంలో విచారణ సందర్భంగా ఆమెకు బెయిల్‌ ఇవ్వాలంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరపు న్యాయవాది కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. దీనిపై అదనపు సెషన్స్‌ జడ్జి శైలేందర్‌ మాలిక్‌ ఈడీ స్పందన కోరింది.

అయితే అప్పటికే రెగ్యులర్‌ బెయిల్‌ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అప్పటివరకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని జాక్వెలిన్‌ న్యాయవాది కోరారు. దీన్ని అంగీకరిస్తూ రూ.50 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్‎ను ఢిల్లీ పాటియాల కోర్టు మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు