Jayalalitha: బ్యాంకుల్లో జమ చేసిన సొమ్ము, నగలు, ఆస్తి.. అంతా పోగొట్టుకున్నా.. నాకంటూ..

26 Sep, 2023 13:26 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కెరీర్‌ ఇరకాటంలో పడటం ఖాయం. ఆచితూచి అవకాశాలను ఎంచుకుంటూ పోతుండాలి. కానీ ఆ వయసులో ఏది సెలక్ట్‌ చేయాలో, ఏది రిజెక్ట్‌ చేయాలో అర్థం కాక కొందరు నటీమణులు తప్పటడుగులు వేసి కెరీర్‌నే ఇబ్బందుల్లో పడేసుకున్నారు. అలాంటివారిలోనే జయలలిత ఒకరు. తను ఐటం సాంగ్స్‌, గ్లామర్‌ పాత్రలు చేస్తూ పోవడంతో హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాలేదు.

పైగా అప్పుడు పొట్టి దుస్తుల్లో కనిపించినందుకు ఇప్పటికీ సరైన ఛాన్సులు లభించడం లేదు. సీనియర్‌ హీరోయిన్లు అమ్మ, వదిన పాత్రలు చేస్తుంటే తనకు మాత్రం అటువంటి చెప్పుకోదగ్గ పాత్రలు రావడం లేదు. అప్పట్లో ఐటం సాంగ్స్‌ చేయడం వల్లే తనకు సరైన పాత్రలు దక్కడం లేదంది. ఇకపోతే గతంలో ఓ డైరెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతడి టార్చర్‌ భరించలేక మూడు నెలలకే విడిపోయింది. అప్పటినుంచి ఒంటరిగానే జీవిస్తోంది. ఆ మధ్య డ్రైవర్‌ను నమ్మి సంపాదించిన ఆస్తినంతా పోగొట్టుకుంది.

తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. స్వయంకృతపరాధం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరికి 40 సంవత్సరాలుగా సంపాదించింది ఒక్కసారిగా పోగొట్టుకున్నాను. కార్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో జమ చేసిన మొత్తం, నగలు.. ఆస్తి అంతా పోగొట్టుకున్నాను. ఇప్పుడు కేవలం నాకంటూ ఒక ఫ్లాట్‌ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఇదేందిది.. ఇది ప్రభాస్‌ విగ్రహమా? నెట్టింట ట్రోలింగ్‌.. బాహుబలి నిర్మాత సీరియస్‌

మరిన్ని వార్తలు