Jeevitha Rajasekhar: 30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్‌ రీఎంట్రీ, సూపర్‌ స్టార్‌కు చెల్లిగా..

1 Mar, 2023 10:13 IST|Sakshi

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు నటి జీవిత రాజశేఖర్‌. నిర్మాతగా, దర్శకురాలిగా మారి భర్త, పిల్లల సినిమాల బాధ్యత తీసుకున్న ఆమె ఇప్పుడు నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 1991లో నటుడు రాజశేఖర్‌తో వివాహం ఆనంతరం ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత జీవిత ఏ సినిమాల్లో కనిపించలేదు. కానీ మెగాఫోన్‌ పట్టి దర్శకురాలిగా పలు చిత్రాలు తెరకెక్కించారు.

చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

ఇక ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఆమె నటించేందుకు సిద్ధమయ్యారు. ఓ స్టార్‌ హీరోకు సోదరిగా నటించనున్నట్లు సమాచారం. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్రంతో ఆమె తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని స్టార్ట్‌ చేయడం విశేషం. ప్రస్తుతం జైలర్‌ సినిమాతో బిజీగా ఉన్న రజనీ తన నెక్ట్స్‌ చిత్రం కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో చేయబోతున్నారు. మార్చి 7న ఈ మూవీ షూటింగ్‌ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

చదవండి: పెళ్లి తర్వాత నయనతారకు కలిసిరావడం లేదా? భర్తకు అలా, నయన్‌కు ఇలా!

ఈ సందర్భంగా ఇందులోని ప్రధాన పాత్రలకు చిత్ర బృందం స్వాగతం పలుకుతూ ఓ ట్వీట్‌ చేసింది. ఇందులో రజనీకాంత్‌, నటుడు విష్ణు విశాల్‌తో పాటు నటి జీవిత రాజశేఖర్‌ ఫొటోలను షేర్‌ చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్‌కు సోదరిగా నటించబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్‌ వెల్లడించారు. అయితే లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను కూడా మేకర్స్‌ ప్రకటించనున్నారు. 

మరిన్ని వార్తలు