Juhi Chawla: నాది పబ్లిసిటీ స్టంటా? మీరే తేల్చండి!

9 Aug, 2021 14:09 IST|Sakshi

5జీ అమలుకు వ్యతిరేకంగా పోరాటం: మౌనం వీడిన జుహీ చావ్లా

20 లక్షల రూపాయల జరిమానా విధించిన  కోర్టు

సాక్షి, ముంబై: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇటీవల కోర్టు తీర్పుపై బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఎట్టకేలకు  మౌనం వీడారు.  కోర్టు తీర్పు, జరిమానాపై తొలిసారి సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు.  పబ్లిసిటీ స్టంట్‌,  కోర్టు సమయం వృధా అంటూ 5జీ టెక్నాలజీ అమలుపై తన పిటిషన్‌ తిరస్కరించడంపై ఆమె  నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు  దీనిపై స్పందించాల్సిన సమయం  వచ్చిందని తన పోరాటం  ప్రచారం, ప్రాపకం కోసం అవునో కాదో మీరే తేల్చాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇండియాలో 5 జీ టెక్నాలజీ అమలుకు సంబంధించి  రెండు నెలల క్రితం తన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చిన తర్వాత బాలీవుడ్ నటి  సోమవారం ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. మనుషులకు, జంతువులు 5జీ  టెక్నాలజీ మొబైల్‌ టవర్ల దుష్పరిణామాలపై ఎంత సురక్షితమో తెలియజేయాలని ఆర్‌టీఐతోపాటు, వివిధ ఏజెన్సీలను కోరామని, ఆ వివరాలను మీరూ  పరిశాలించాలని, ఓపికగా తను షేర్‌ చేసిన వీడియోలోని అంశాలని  గమనించాలంటూ తన 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని వీడియోలో వివరించారు.  

దేశంలో 5జి మొబైల్ టెక్నాలజీ అమలు, రేడియో ఫ్రీకెన్సీ రేడియేషన్ (ఆర్ఎఫ్) దుష్పరిణామాలపై ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసిన  వీడియోలో ప్రస్తావించారు. 5జీ టెక్నాలజీ వల్ల ఇటు చిన్నా పెద్దా, స్త్రీ పురుషులు,  పసివాళ్లు, అటు మూగజీవాలకు కూడా సురక్షితమని సర్టిఫై చేస్తూ, తమ వాదనను బలపరచే అధ్యయనాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జుహీ చావ్లా కృషి చేస్తున్నాననీ, 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. ఈ కేసులో జుహీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

మరిన్ని వార్తలు