నటుడు మృతిపై కస్తూరి సంతాపం; మండిపడుతున్న నెటిజన్లు

29 May, 2021 15:42 IST|Sakshi

తమిళ నటుటు, నిర్మాత వెంకట్‌ సుభా మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(మే 29) తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పరిశ్రమకు చెందిన పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడు ప్రకాశ్‌ రాజ్‌, నటి రాధిక శరత్‌ కుమార్‌లతో పాటు నటి కస్తూరి శంకర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ నేపథ్యంలో కస్తూరి ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు. కొద్ది రోజుల కిందటే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు జ్వరం వచ్చింది. టెస్టులు చేసుకోగా ఫలితాలు నెగిటివ్‌ వచ్చాయి. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు. సారీ సుభాగారు’ అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. అది చూసిన డీఏంకే కార్యకర్తలు, ఫాలోవర్స్‌ ఆమెపై మండిపడుతున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అంటు కస్తూరిపై విరుచుకుపడుతున్నారు. 

ఇక రాధిక ట్వీట్‌ చేస్తూ.. ‘మీకు వీడ్కోలు చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది. రాడాన్ సంస్థలో ఆయన భార్య నాతో ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నారు. వెంకట్‌ గత కొన్నేళ్ల నుంచి నాకు తెలుసు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన మరణవార్త తెలియగానే గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే ప్రకాశ్‌ రాజ్‌ స్పందిస్తూ.. ‘ఎంతో బాధగా ఉంది.. ఇలా ఒక్కొక్కరిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను కోల్పోవడం తట్టుకోలేకపోతోన్నాను.. నిస్సహాయుడిగా మిగిలిపోయాను. వారి జ్ఞాపకాలతో నా జీవితం ఎంతో భారంగా మారుతోంది.. నా ఈ జీవితప్రయాణంలో భాగస్వామివి అయినందుకు ధన్యవాదాలు.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి’ అని కోరుకుంటున్నాను అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు