పరీక్ష తప్పదు

23 Nov, 2020 03:53 IST|Sakshi
కోవిడ్‌ పరీక్ష చేయించుకుంటున్న కత్రినా

కోవిడ్‌ తర్వాత అన్నీ మారాయి. కొత్త విధానాలు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. సినిమాల చిత్రీకరణ మొదలెట్టాలంటే నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ కరోనా పరీక్ష చేయించుకోవాలి.. ఆ తర్వాతే పని ప్రారంభిస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ఓ కొత్త  సినిమా చిత్రీకరణలో భాగంగా కరోనా టెస్ట్‌ చేయించుకున్నారు. పరీక్ష చేయించుకుంటున్న వీడియోను పంచుకుని– ‘‘జాగ్రత్త ముఖ్యం. షూట్‌ ముందు టెస్ట్‌ తప్పనిసరి’ అని పేర్కొన్నారు. కాగా ఈ పరీక్షలో కత్రినాకి కరోనా నెగెటివ్‌ వచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా