సమంత 'మయోసైటిస్‌' వ్యాధిపై కీర్తి సురేష్‌ కామెంట్స్‌ వైరల్‌

1 Nov, 2022 06:50 IST|Sakshi

ఇప్పుడు చర్చంతా నటి సమంత గురించే. ఇంతకుముందు ఈమె వ్యాఖ్యలు, గ్లామరస్‌ పొటోలు, నాగచైతన్య నుంచి విడిపోవడం గురించి రకరకాలుగా చర్చించుకున్న సినీ వర్గాలు ఇప్పుడు ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి చర్చించుకుంటున్నాయి. ప్రముఖ కథానాయికిగా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్న సమంత ది ప్యామిలీ మెన్‌ – 2, వెబ్‌ సిరీస్‌తో జాతీయస్థాయిలో నటిగా పేరు తెచ్చుకున్నారు.

ఎప్పుడు చిరునవ్వుతో ఉండే సమంత, ఇప్పుడు మయాసిటీస్‌ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇటీవల స్వయంగా వెల్లడించారు. దీంతో ఆమె అభిమానులు షాక్‌కు గుర య్యారు. ఇక సహ నటీనటులు, స్నేహితులు, సన్నిహితులు సమంతను ఓదార్చే పనిలో పడ్డా రు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నుంచి పలువురు సమంతలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఆమె మాజీ భర్త నాగచైతన్య, నాగార్జున కూడా ఓదార్పు వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అలాగే నాగచైతన్య సోదరుడు అఖిల్‌ కూడా సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. 

నటి కాజల్‌ తదితర హీరోయిన్లు కూడా అధైర్య పడొద్దని, త్వరలోనే మరింత శక్తివంతంగా తిరిగి వస్తావని ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా నటి కీర్తి సురేష్‌ కూడా సమంతను ఓదార్చేలా ‘నీకు అధిక శక్తి వస్తుంది. మరింత ధృఢంగా తిరిగి వస్తావు’ అంటూ ట్విట్టర్లో పోస్ట్‌ చేసింది. కాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం ఈ నెల 4వ తేదీన దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. 

చదవండి: (విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా?)

మరిన్ని వార్తలు