సీరియల్‌ ప్రమోషన్‌ కోసం భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్న ‘బేబమ్మ’

28 Jul, 2021 16:31 IST|Sakshi

ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజీ సంపాదించుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. తొలి సినిమానే సూపర్‌, డూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నాని శ్యామ్‌ సింగరాయ్‌, సుధీర్‌ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలతో పాటు లింగుస్వామి, రామ్‌ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

కేవలం సినిమాలే కాకుండా.. ప్రకటనల్లోనూ నటించేందుకు సిద్దమైంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఉన్న క్రేజీని దృష్ట్యా పలు సంస్థలు తమ ప్రాడక్ట్స్ ప్రకటనల కోసం నటించమని కోరుతున్నాయట. ఇక ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ జీతెలుగు అయితే బేబమ్మ క్రేజీని సీరియల్స్‌ ప్రమోషన్‌ కోసం వాడేసింది. జీతెలుగులో ప్రసారమయ్యే ఓ కొత్త సీరియల్‌ ప్రమోషన్‌లో కృతిశెట్టి పాల్గొంది. ఈ ప్రకటన కోసం కృతి ఏకంగా కోటి రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకే ఒక్క సినిమాలో నటించి, ప్రకటనకు రూ. కోటి రెమ్యూనరేషన్‌ తీసుకున్న హీరోయిన్‌గా కృతి రికార్డుల్లోకి ఎక్కినట్లే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు